మొక్కలు నాటితేనే భవిష్యత్

Mon,August 19, 2019 11:55 PM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ: మొక్కలు నాటితేనే భవిష్యత్ ఉంటుందని, మొక్కలు నాటి ప్రాణదాతలు కావాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు అన్నారు. సోమవారం ఉదయం మండలంలోని గుర్రలపాడు గ్రామంలో హరితహారంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. సాయంత్రం పాలేరు ఎమ్మెల్యే కందాల, రాష్ట్రపార్టీ కార్యదర్శి తాతా మధులు మండలంలోని తీర్థాల పంచాయతీ, మంగళగూడెంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని పథకాన్ని సీఎం కేసీఆర్ హరితహరం పేరుతో అంతరించిపోతున్న అడవులను సంరక్షిస్తున్నట్లు తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం పేరుతో కోట్లాది మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు తెలిపారు. కొతులు అడవులకు వాపస్ పోవాలన్న, వర్షాలు సమృద్ధిగా కురువాలన్న మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మొక్కలు నాటి ప్రాణదాతలు కావాలన్నారు. భవిష్యత్తులో సాగునీటి ప్రమాదఘంటికలు రాకుండా ఉండాలంటే మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, రూరల్ ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ రాంబాబు, మండలపార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, సర్పంచ్‌లు తేజావత్ బాలు, యండపల్లి రాధిక, ఎంపీటీసీలు కళ్లెం వెంకటరెడ్డి, సైదాబీ, గొడ్డుగొర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నల్లపునేని భాస్కర్‌రావు, బొల్ంల వెంకన్న, తమ్మినేని కృష్ణయ్య, నాగండ్ల నాగేశ్వరరావు, శ్రీను, ధర్మారెడ్డి, యండపల్లి రవి, వెంకటయ్య తదితరులున్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles