మొక్కలు నాటితేనే భవిష్యత్

Mon,August 19, 2019 11:56 PM

ఖమ్మం వ్యవసాయం: సమాజానికి అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టకరమని, మెరుగైన సేవలు అందించి వారి మన్నలను పొందాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా ఎమ్మెల్యే నగర వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులు, అధికారులు, వ్యాపారులు, కార్మికులు ఘనస్వాగతం పలికారు. తొలుత అపరాల యార్డును సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ జరుగుతున్న యార్డు విస్తీర్ణం పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు, వ్యాపారులు, కార్మికులతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డు మధ్యలో అడ్డంకిగా ఉన్న భూసార పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం యార్డు మధ్యలో ఉండటం ద్వారా కలుగుతున్న అసౌకర్యాన్ని కార్మికులు, వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

పత్తియార్డులో ఉన్న ఇతర భవనాలకు ఈ కేంద్రాన్ని తరలించాలని సూచించారు. అదే విధంగా మార్కెట్‌లో ఉన్న పురాతన గోడౌన్‌ల గూర్చి అధికారులు, వ్యాపారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆ భవనాలను సైతం తొలిగించినైట్లెతే మరింత విస్తరించుకునే అవకాశం ఉందని చైర్మన్, వైస్‌చైర్మన్లు అభిప్రాయపడ్డారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్యేను పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఒకటన్నారు. ఇంతటి గొప్ప మార్కెట్‌కు పాలకవర్గ సభ్యులుగా, చైర్మన్, వైస్‌చైర్మన్లుగా అవకాశం రావడం అదృష్టంగా భావించాలన్నారు. అన్నదాతలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదన్నారు. నిత్యం జిల్లా రైతులే కాకుండా పొరుగుజిల్లాల రైతులు సైతం వస్తున్నారన్నారు. మార్కెట్‌పై ఉన్న నమ్మకంతో వారు పంటను తీసుకురావడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, పాలకవర్గసభ్యులు, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ఆర్ సంతోష్, నగర టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ కమర్తపు మురళి, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, పాలడుగు పాపారావు, కార్మిక విభాగం నాయకులు నున్నా కోదండరామయ్య, నీలం కృష్ణ, వర్తకసంఘం ప్రధాన కార్యదర్శి గుడవర్తి శ్రీనివాసరావు, వ్యాపారులు మెంతుల శ్రీశైలం, ఎర్రా అప్పారావు, మాటేటి రామారావు, పత్తిపాక రమేశ్, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, కోసూరి రమేశ్‌గౌడ్, కనకం భద్రయ్య, కార్మికులు, దడవాయిలు, మార్కెట్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles