నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

Mon,August 19, 2019 11:57 PM

-ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ
కామేపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలను నా టి రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దాలని ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ అన్నారు. సోమవారం మండల పరిధిలోని జగన్నాథతండాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తరిగిపోతున్న అటవీ సంపదను తిరిగి తీసుకు రావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు.మొక్కలను నాటి సంరక్షించుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణోత్ సునిత,జడ్పీటీసీ బాణోత్ వెంకటప్రవీణ్‌నాయక్,సర్పంచ్ అజ్మీర శౌరి,పులసం జయమ్మ,జాటోత్ జాయ్‌లూసీ,మాళోత్ రాంచందర్,ధరావత్ బాలు,ఎంపీటీసీ గుగులోత్ గబ్రూనాయక్,మాజీ ఎంపీపీ మాళోత్ సరిరాంనా యక్,మాజీ జడ్పీటీసీ మేకల మల్లిబాబుయాదవ్,టీఆర్‌ఎస్ నాయకులు సామా మోహన్‌రెడ్డి,అంతోటి అచ్చయ్య,మల్లెంపాటి శ్రీనివాసరావు,అజ్మీర రాంకోటి, బాణోత్ రాందాస్,నున్నావత్ సూర్యంనాయక్ తదితరులున్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles