ప్రతిభను గుర్తిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు

Mon,August 19, 2019 11:57 PM

-సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి టౌన్:విద్యార్థులలోని ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని విశ్వశాంతి విద్యాలయంలో 1వ తరగతి చదువుతున్న మన్విత్ జగన్నాథ్ నాయుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నిమి త్తం బహుముఖ ప్రతిభను విజయవంతంగా పూర్తి చేసి అవార్డ్ స్వీకరించాడు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నాడు, ఎమ్మెల్యే , ఎంఈఓ, అవార్డ్ ప్రతినిధులు స్థానిక , జిల్లా, రాష్ట్ర , దేశా విదేశాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇచ్చి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందాడు.ఐదేళ్ల చిన్నారి మన్విత్‌కు అవార్డ్డు ప్రదానం చేసున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రకటించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ 5 ఏళ్ళ వయస్సులోనే అబ్బర పరిచే ప్రతిభను సొంతం చేసుకున్న మన్విత్ నాయుడు తల్లిదండ్రులు అభినందనీయులన్నారు.

తెలుగు రాష్ర్టాల ప్రతినిధులు బాలాజీ ప్రసాద్, వాణిపతి శాస్త్రీ, సుబ్రహ్మణ్యం, బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు అడిగిన 20 విభాగాలకు చెందిన విడతల వారి ప్రశ్నలకు చిన్నారి ఏకకాలంలో సమాధానాలు చెప్పి ఆహుతులను అబ్బర పరిచాడు. పట్టణానికి చెందిన బొర్రా వెంకటేశ్వరరావు, జ్యోతి ల కుమారుడు మన్విత్ జగన్నాద నాయుడును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు , కరస్పాండెంట్ పసుపులేటి నాగేశ్వరరావు , జడ్పిటిసి కూసంపూడి రామారావు, చల్లగుళ్ళ నర్సింహరావు , చల్లగుండ్ల కృష్ణయ్య, కొత్తూరు ఉమామహేశ్వరరావు, మధుసూదన రాజు, గాదిరెడ్డి రాంబాబు రెడ్డి,మంత్రిప్రగడ సత్యనారాయణ, తోట గణేష్ తదితరులున్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles