దృశ్యం అపురూప కావ్యం..

Mon,August 19, 2019 11:57 PM

-ఫొటోగ్రఫీ దినోత్సవంలో ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్
ఖమ్మం, నమస్తే తెలంగాణ :ప్రస్తుత సమాజంలో ఫొటో (దృశ్యం) అనేక సందర్భాలకు, అనేక అంశాలకు అపురూప కావ్యమని, ఈ దృశ్యంతో జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను మూటగట్టుకునే అద్భుత శక్తి ఫొటోగ్రఫీకే ఉందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జిల్లా ఫొటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఫొటోగ్రాఫీ దినోత్సవం వేడుకలకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక దృశ్యం అనేక అనుబంధాలకు, ఆప్యాయతలకు నిదర్శం ఫొటోగ్రఫీ అన్నారు.

గతాన్ని వర్తమానంగా చేసి భవిష్యత్ తరం దాక తీసుకువెళ్లి చూపించగలిగే ఓ అద్భుత శక్తి ఛాయచిత్రకళ అని తెలిపారు. ప్రపంచంలో ఎంత టెక్నాలజీ మారిన ఫొటోకు గుర్తింపు తగ్గలేదన్నారు. జిల్లా ఫొటో రంగం కార్మికులు వారి కుటుంబ సభ్యులకు కలిపి ఖమ్మం మమత హాస్పిటల్‌లో ఉచిత వైద్య సౌక్యరాల కోసం హెల్త్‌కార్డులు అందిస్తామని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, కార్పొరేటర్‌లు కమర్తపు మురళీ, పగడాల నాగరాజు, షౌకత్ అలీ తదితరులున్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles