సంవృద్ధిగా సాగునీటి సరఫరాకు కృషి

Mon,August 19, 2019 11:58 PM

వైరా, నమస్తేతెలంగాణ, ఆగస్టు 19 : వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతులకు సాగునీటిని సంవృద్ధిగా సరఫరా చేసేందుకు అవసరమైన కృషి చేస్తానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. రాష్ట్రంలో రైతాంగ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పని చేస్తున్నారని ఆయన వివరించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా రిజర్వాయర్ ఆయకట్టు రైతుల సమావేశం నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే రాములునాయక్ పాల్గొని మాట్లాడారు. రైతులు పంటల సాగుపై ఆధైర్య పడవద్దని అన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైరా ఆయకట్టులో పంటల సాగుకు ఖరీఫ్‌తో పాటు ముందస్తు రబీకు సాగు నీరు విడుదల చేయించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టమైన హమీ ఇచ్చారు. సమావేశంలో రైతులు, వ్యవసాయ అధికారులు ఖరీఫ్, ముదస్తు రబీ సాగుపై తమ అభిప్రాయాలను తెలిపారు. మందుగా నీటిపారుదల శాఖ ఈఈ నరసింహరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ఆయకుట్టు రైతులు ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసేందుకు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కేవీకే కో-ఆర్డినేటర్ హేమంత్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉండదని స్పష్టం చేశారు.

అనంతరం ఆయకట్టు రైతులు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను సమావేశంలో వివరించారు. అత్యధిక మంది రైతులు ముందస్తు రబీ పంట సాగుపై మొగ్గు చూపగా, మరికొంత మంది రైతులు ఖరీఫ్‌కు నీటిని వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. కార్యక్రమంలో వైరా ఎంపీపీ బొంతు సమత, నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్, జేఈ రాణి, వైరా ఏడీఏ వేల్పుల బాబురావు, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, కారేపల్లి మండలాల వ్యవసాయ అధికారులు శ్రీరామోజి పవన్‌కుమార్, దొడ్డిగర్ల బాలాజి, నరసింహరావు, కే ఉమామహేశ్వరరెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు షేక్ లాల్‌మహ్మద్, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కమిటీ సభ్యుడు మచ్చా నరసింహరావు, టీఆర్‌ఎస్ నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, మోరంపూడి ప్రసాద్, పసుపులేటి మోహన్‌రావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles