హేచరీలలో నీటినాణ్యతే ప్రధానం: జశ్వంతి

Mon,August 19, 2019 11:58 PM

కూసుమంచి:చేపపిల్లల ఉత్పత్తికి హేచరీలలో వినియోగించే నీటినాణ్యతే ప్రధానమని నల్లగొండ జిల్లా కంపాసాగర్ కేవీకే శాస్త్రవేత్త కుమారి జశ్వంతి అన్నారు. పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో చేపపిల్లల ఉత్పత్తిదారులకు జరుగుతున్న 25 శిక్షణశిబిరంలో సోమవారం ఆమె ప్రత్యేక అథితిగా పాల్గొని ప్రసంగించారు. చేపపిల్లలను పెంచే హేచరీలలో వినియోగించే నీటి నాణ్య త ప్రధానమని చెప్పారు. నీటిలో ప్రాణవాయువు కనీసం 4పీపీ ఎం ఉంటే చేపపిల్లల బతుకుదల శాతం అధికంగా ఉంటుందని తెలిపారు. అలాగే నీటిలో కాఠినత్వం కనీసం 30 నుంచి 60 పీపీఎం వరకు ఉండాలన్నారు. అనంతరం నీటి నాణ్యత పరిశీలన విధానాన్ని శిక్షణకు హాజరైన వారికి క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా చేసి, చూపారు. అనంతరం స్థానిక శాస్త్రవేత్త పీ.శాంతన్న తల్లిచేపల ఎంపిక విధానాన్ని క్షేత్రస్థాయిలో వివరించారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles