రామయ్య సన్నిధిలో ఎంపీ నామా

Wed,August 21, 2019 02:17 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ:భద్రాచలం శ్రీసీతా రామచంద్రస్వామివారిని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళ వారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఎంపీకి సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనే యస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూ క మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం అర్చకులు ఆలయ విశిష్టత గురించి ఎంపీకి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు, స్థానిక విద్యా వేత్త చావా లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ భద్రాచలం మండల అధ్యక్షుడు యశోద నగేష్‌, నాయకులు పడిసిరి శ్రీనివాస్‌, పెద్దినేని శ్రీనివాస్‌, రఫీ, మహిళా నేతలు ఎండీ ముంతాజ్‌, మాజీ సర్పంచ్‌ భూక్యా శ్వేత, సీతామహాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles