నోటీస్‌ బోర్డుపై ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నియామక లిస్ట్‌

Wed,August 21, 2019 02:18 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ ఆగస్టు20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్థానికత కలిగిన గిరిజన అభ్యర్థులు తాత్కాలికంగా ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌గా నియామకం పొంది ఉన్నారు. అట్టి వారి ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసేందుకు గాను వారి పేరు, ఏజెన్సీ ఏరియా ధ్రువీకరణ పత్రం నెం. అడ్రస్‌లు సంబంధిత తహసీల్దార్‌ నోటీస్‌ బోర్డు పై, ఐటీడీఏ నోటీస్‌ బోర్డుపై, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెబ్‌సైట్‌, ఐటీడీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ధ్రువీకరణ పత్రాలపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో ప్రాజెక్టు అధికారి ఐటీడీఏ భద్రాచలం, ఉప సంచాలకులు (గిరిజన సంక్షేమశాఖ) భద్రాచలం వారికి వారం రోజుల లోపల తగిన ఆధారాలతో సమర్పించాల్సిందిగా కోరారు. లేనిచో జిల్లా స్క్రూట్నీ కమిటీ వారిచే తుది నిర్ణయంగా భావించవచ్చునని తెలిపారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles