ఖమ్మం జిల్లాకు 131 మంది ఏఆర్‌ సిబ్బంది

Wed,August 21, 2019 02:21 AM

ఖమ్మం క్రైం, ఆగస్టు 20: బదిలీల ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా ఉందని సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా విధులు నిర్వహించారో అదే స్ఫూర్తితో ఇప్పుడూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఉత్తర్వులు, నిబంధనలకు అనుగుణంగా పోలీస్‌ సిబ్బంది అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. సిబ్బంది వ్యక్తిగత, వారి తల్లిదండ్రులు, పిల్లల అరోగ్య పరిస్థితులు వంటి సమస్యలు ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే రెండు సంవత్సరాల్లో రిటైర్డ్‌మెంట్‌ ఉన్న సిబ్బందిని కూడా మినహాయించామన్నారు. అదేవిధంగా జీవిత భాగస్వామి ఉద్యోగులైతే ఆ సిబ్బందిని కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు.అలాగే ఆడ్మినిస్ట్రేషన్‌ గ్రౌండ్స్‌లోని సిబ్బందికి మినహాయింపు ఇచ్చినట్లు సీపీ వివరించారు. సిటీ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ సిబ్బంది ఆర్డర్‌ టూసర్వ్‌ బదిలీ ప్రక్రియలో భాగంగా మంగళవారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆవరణలోని పోలీస్‌ కల్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో బదిలీల కార్యక్రమం నిర్వహించారు. ఆర్డర్‌ టూ సర్వ్‌లో భాగంగా ఒక సంవత్సర కాలంపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించేందుకు గత ఏడాది వెళ్లిన ఏఆర్‌ పోలీస్‌ సిబ్బంది తిరిగి ఖమ్మం జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపడంతో ఎలాంటి అపోహలకూ అస్కారంలేకుండా మంగళవారం అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ మాధవరావు, ఏఆర్‌ ఏసీపీలు విజయబాబు, రియాజ్‌, భద్రాద్రి కొత్తగూడెం ఏఆర్‌ ఏసీపీ కుమారస్వామి, భద్రాద్రి కొత్తగూడెం ఏవో వెంకటేశ్వర్లు, మినిస్టీరియల్‌ స్టాఫ్‌, పోలీస్‌ అసోసియేషన్‌, పోలీస్‌ సిబ్బంది సమక్షంలో లాటరీ ద్వారా బదిలీలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు కొందరిని బదిలీ చేశారు. ప్రధానంగా నూతన జిల్లాగా ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో విధులు నిర్వహించిన ఏఆర్‌ఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీ లను కేటరీలుగా విభజించి సమాన నిష్పత్తిలో ముందుగా బదిలీ చేశారు. మిగిలిన సిబ్బందిని లాటరీ పద్ధతిలో బదిలీ చేశారు. ఈ బదిలీల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 131 మంది పోలీస్‌ సిబ్బంది ఖమ్మం జిల్లా కార్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రానున్నారు. ఆర్‌ఐలు శ్రీనివాస్‌, రవి, కృష్ణ, సీపీవో స్టాఫ్‌ భాస్కర్‌రెడ్డి, ఉమర్‌, సీసీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles