రోటోవైరస్‌ వ్యాక్సిన్‌పై వర్క్‌షాప్‌

Wed,August 21, 2019 02:22 AM

డెంగీ గుర్తింపునకు ప్రత్యేక కార్యక్రమాలు
డీఎంహెచ్‌వో డాక్టర్‌ కళావతిబాయి
మయూరిసెంటర్‌, ఆగస్టు 20: రోటో వైరస్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంపై జిల్లాలోని ఏఎన్‌ఎంలకు మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బీ.కళావతిబాయి మాట్లాడుతూ ఈ రోటో వైరస్‌ వ్యాక్సిన్‌ను అతి త్వరలో జిల్లాలో గల అర్హులైన పిల్లలందరికి రోటీన్‌ ఇమ్యూనైజేషన్‌ టీకాలతోపాటు అందించనున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ గురించి ముఖ్యంగా గ్రామాలలో గల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు. అంతేకాకుండా ఏఎన్‌ఎంలు ఈ రోటోవైరస్‌ వ్యాక్సిన్‌ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకొని వారు పనిచేస్తున్న గ్రామాలలో వ్యాధి నిరోధక టీకాలతోపాటు ఈ వ్యాక్సిన్‌ను 6, 10, 14 వారాలలో పిల్లలకు వేయాలని సూచించారు. అనంతరం జిల్లా ఇమ్యూనైజేషన్‌ ద్వారా వ్యాక్సిన్‌ వేయటానికి ఎలా సన్నద్దం కావాలో డాక్టర్‌ జీ అలివేలు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. డీవీఎల్‌ఎం రమణ, ఆర్‌ఎం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డెంగీ వ్యాధుల గుర్తింపునకు కార్యక్రమాలు
ఈ నెల 26 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు డెంగీ వ్యాధుల గుర్తింపునకు ప్రత్యేక కార్యక్రమాలను జిల్లాలో నిర్వహించనన్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. వర్క్‌షాప్‌ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వ్యాధుల గుర్తింపునకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఆశావర్కర్‌తోపాటు ఒక మగ వలంటీర్‌ కూడా పాల్గొనాలని సూచించారు. పోగ్రామ్‌ ఆఫీసర్‌ ఏపీఎల్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ మాట్లాడుతూ ఆశావర్కర్‌, ఒక వలంటీర్‌ కలిసి ఉదయం 6:30 గంటల నుంచి 10:30 గంటల వరకు రోజుకు 20 ఇండ్లను సందర్శించి వ్యాధులను గుర్తించి పీహెచ్‌సీలకు తరలించాలని సూచించారు. డీటీసీవో సుబ్బారావు, డీఎన్‌ఎంవో డాక్టర్‌ ప్రమీల, పీవో ఎంసీహెచ్‌ డాక్టర్‌ రామారావు, ప్రభాకర్‌, డీవై డీఈఎంవో సాంబశివరెడ్డి, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

109
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles