సీజనల్‌ జలగలు!

Wed,August 21, 2019 02:23 AM

-రోగులను పీల్చిపిప్పిచేస్తున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు
-కమీషన్ల కక్కుర్తికి ఎడాపెడా పరీక్షలు..
-ప్రభుత్వ నిబంధనలకు పాతర
-డీఎంహెచ్‌ఓ తనిఖీలు చేపట్టినా మారని సెంటర్ల నిర్వహణ
మయూరిసెంటర్‌: ఖమ్మంలో వైద్యం దందా ఆగడంలేదు. రోజురోజుకు మితిమీరి పోతుంది. సీజన్‌ వచ్చిదంటే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు,డయాగ్నస్టిక్‌ సెంటర్లకు పండగే పండగ. జబ్బు చేసి ఆస్పత్రి మెట్లు ఎక్కితే చాలు అందినకాడికి గుంజుతు న్నారు. మాములు జ్వర్వం వచ్చి వెళ్లినా.. రక్తపరీక్షలన్నీ చేయించి రోగిని పీల్చి పిప్పి చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు పాతర వేస్తూ కొన్ని ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లు చేస్తున్న ఆగడాలు చెప్పలేనివి. సీజనల్‌ వ్యాధుల కాలంలో ఆసరాగా చేసుకుని డాక్టర్లను ఆకట్టుకుని అందులో కొంత సొమ్మును ముట్ట చెబుతూ పర్స టేజ్‌ల రూపంలో వైద్యులను తమ స్కానింగ్‌ సెంటర్‌కే పంపించాలని బుట్టలో వేసుకుని ఇద్దరూ నిరుపేద రోగుల రక్త పరీక్షలు, స్కానింగ్‌లు నిర్వహించి వారి వద్ద నుంచి రక్తాన్ని పీలుస్తున్నారు. జ్వర తీవ్రతను బట్టి వ్యాధిని గుర్తించేందుకు కొన్ని రక్త పరీక్షలు తప్పనిసరి. ప్రతి రోగికి డెంగ్యూ, ఎలిసా, మలేరియా, చికున్‌గున్యా, ప్లేట్‌లేట్స్‌ ఇలా అనేక రకాల రక్త,మూత్ర పరీక్షలు రాస్తున్నారు కొందరు వైద్యులు. కొంత మంది ప్రైవేట్‌ వైద్యశాల వైద్యులు రాసి డయాగ్నస్టిక్‌ సెంటర్ల నుంచి డాక్టర్లు జెబులు నింపుకునే కార్యక్రమానికి ఓపీ సేవల నుంచి శ్రీకారం చుడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలు ఇలా.. ప్రతి డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో రోగులకు కనిపించే విధంగా ఏ పరీక్షకు ఎంత ఫీజు చెల్లించాలో బోర్డులను ప్రదర్శించాల్సి ఉంటుంది. వారి వద్ద నిబంధనలకు లోబడి ఏ పరీక్షలు నిర్వహించబడవో కూడా తెలియ జేయాలి. స్కానింగ్‌లు చేపట్టే ప్రక్రియలో లింగనిర్దారణ వంటివి ఇక్కడ చేపట్టడం నిషేధమని అంశాన్ని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. కాని రోగులకు ఇటువంటి బోర్డులు కనిపించకుండా ఎక్కడో ఒక మూలన చిన్నపాటి ఫ్లెక్సీని నామమాత్రంగా కొన్ని సెంటర్ల నిర్వహకులు ఉంచారు. డెంగ్యూ జ్వరానికి పరీక్ష నిర్వహించి వాటిని నిర్దారించే హక్కు ప్రైవేట్‌ వైద్యశాలలకు చెందిన డయాగ్నస్టిక్‌ సెంటర్లకు లేదు. పరీక్షల కోసం నమూనాలు తీసుకున్నప్పటికీ ఆ రక్త నమూ నాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో గల ఎలిసా సెంటర్‌కు పంపించి అక్కడ నిర్దారించుకోవాలి.డెంగ్యూ పాజిటివ్‌గా గుర్తిస్తే అప్పుడు వైద్యసేవలందించాలి. అయితే ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఎన్‌ఎస్‌-1 అనే డెంగ్యూ జ్వరానికి చెం దిన ఒక పరీక్షను మాత్రమే ఇక్కడ సెంటర్ల నిర్వహకులు పరీక్షిస్తున్నారనే విమర్శ లున్నాయి. తద్వారా డెంగ్యూగా తెలియజెప్పి రోగి బంధువుల వద్ద నుంచి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

డాక్టర్లకు కమీషన్‌.. డాక్టర్ల రక్త పరీక్షల కోసం తమ డయాగ్నస్టిక్‌ సెంటర్లకే పంపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. డయాగ్నస్టిక్‌ సెంటర్లలో పరీక్షలు నిర్వ హించి తిరిగి డాక్టర్‌ వద్దకు వచ్చినప్పుడు ఓ స్లిపును డాక్లర్‌ తన వద్ద ఉంచు కోవడం అలా వచ్చిన స్లిప్పులను జమచేసి తమ అనుచ రుల ద్వారా ఆయా సెం టర్ల నిర్వహకులకు చేరవేసి నెలకు ఎన్ని పరీక్షలు నిర్వహించారో వారికి లెక్కకట్టి ఆ సొమ్మును డాక్టర్‌లకు ముట్టచెబుతున్నారు. అదేవిధంగా ఆర్‌ఎంపీ వైద్యులు కూడా రోగులను తీసుకవచ్చి అడ్డగోలుగా రక్తపరీక్షలు చేయించి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శలున్నాయి. కొన్ని పరీక్ష కేంద్రాల్లో అనుభవం లేని వాళ్లతో చేయిస్తున్నట్లు తెలిసింది.

మామూళ్ల జాఢ్యం.. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలం సీజన్‌లో సాధారణంగా వ్యాపించే సీజనల్‌ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్‌ ఆసుపత్రులు డయాగ్నస్టిక్‌ సెంటర్లు రింగ్‌గా ఏర్పడి రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్న తరుణంలో నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొందరు సిబ్బంది నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ చూసి చూడన్నట్లుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇరుకుగదుల్లో ఎక్స్‌రే సెంటర్లు.. జిల్లా కేంద్రంలోని వైరారోడ్‌లోని వైద్యశాలల్లో ఎక్స్‌రే సెంటర్లు ఉన్నాయి.ఇందులో చాలా వరకు ఇరుకుగదుల్లో ఉన్నాయి. అయి తే ప్రభుత్వ నిబంధనల మేరకు విశాలమైన గదిలో ఎక్స్‌రే పరికరం, ఎక్స్‌రే తీసిన అనంతరం ఎక్స్‌రే దృవపత్రం, ఆ ఎక్స్‌రేలు తడిగా ఉన్న నేపథ్యంలో ఆరబెట్టేందుకు ప్రత్యేక స్థలం ఉండాలి. కాని వైరా రోడ్‌లో కొన్ని వైద్యశాలల్లో మాత్రం ఇద్దరు మనషులు వెళ్లే దారి వరకు ద్వారం ఉంచి ఒక పడక సామర్థ్యం కలిగిన స్థలంలోనే పరికరాలను ఏర్పాటు చేసి అదే గదిలో ఎక్స్‌రేలను ఆరబెట్టి రోగులకు వైద్యసేవలు అందిస్తున్న సెంటర్లు ఉన్నాయి. కాగా కొన్ని వైద్యశాలల్లో మాత్రం ఆ వైద్యశాలల్లో మాత్రమే మందులు కొనుగోలు చేసుకోవాలి. అదే విధంగా తీసుకున్న మందులకు బిల్లులు ఇవ్వకుండా పంపుతున్న వైనం కూడా కొన్ని వైద్యశాలల్లో ఈ తంతు జరుగుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల మాట బేఖారు..ఇటీవల జిల్లా కేంద్రంలోని బాలాజీ నగర్‌ ప్రాంతంలో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తనిఖీలు నిర్వహించారు. కేవలం సదరు నిర్వాహకులను స్కానింగ్‌ సెంటర్‌ అనే బోర్డును ఏర్పాటు చేసుకో వాలన్నారు. రక్త పరీక్షలకు చెందిన బోర్డును తొలగించాలని సూచించారు. సదరు యాజమాన్యం అధికారి మాటలను బేఖాతారు చేస్తూ సెంటర్‌లో స్కానింగ్‌ నిర్వహిస్తూ రక్త, మూత్ర, మల పరీక్షలను వేరే కేంద్రానికి నమూనాలను పంపుతున్నట్లు సమాచారం.నిబంధనలు అతిక్రమించే డయాగ్నస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు.

129
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles