టీఆర్‌ఎస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలి

Wed,August 21, 2019 11:41 PM

- మధిర మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలి ..
-ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా..
మధిర, నమస్తేతెలంగాణ : ప్రతిఒక్కరూ కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తూ టీఆర్‌ఎస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఎంపీ, టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం మధిర మండల పరిధిలోని దెందుకూరు సమీపంలో ఉన్న శ్రీరస్తూ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మధిర మున్సిపాలిటీలో ఎన్నో సంవత్సరాలుగా పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని అధికారులు చెప్పారని, మధిర మున్సిపాలిటీలో సెంట్రల్‌లైటింగ్ పనులు సెప్టెంబర్ 30 కల్లా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారని, ఆ కార్యక్రమానికి మళ్లీ విచ్చేసి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. సమిష్టి కృషితో మధిర మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగురవేయాలని తెలిపారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు తదితరులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు సైనికుల్లా కృషిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పలుఅభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ఆయా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, చావా రామకృష్ణ, ఐలూరి వెంకటేశ్వరెడ్డి, తుల్లూరి బ్రహ్మయ్య, మెండెం లలిత, డాక్టర్ కోట రాంబాబు, రంగిశెట్టి కోటేశ్వరరావు, దొండపాటి వెంకటేశ్వరరావు, శీలం వెంకటరెడ్డి, దేవిశెట్టి రంగారావు, శీలం వీరవెంకటరెడ్డి, బంధం శ్రీనివాసరావు, పెంట్యాల పుల్లయ్య, తమ్మారపు బ్రహ్మం, యన్నం కోటేశ్వరరావు, చుంచు విజయ్, అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

131
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles