ఘనంగా రామయ్య నిత్యకల్యాణం..

Wed,August 21, 2019 11:48 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చన, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. రామాలయానికి చేరుకొని రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు9 కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

రామున్ని దర్శించుకున్న ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారిని ఆదిలాబాద్ జిల్లా బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గర్భగుడిలో రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles