బాల హక్కుల పరిరక్షణపై రేపు సమావేశం

Wed,August 21, 2019 11:48 PM

-ఖమ్మంలో జరిగే కార్యక్రమానికి ప్రతీ ఒక్కరు హాజరు కాగలరు: సునీల్ దత్
కొత్తగూడెం క్రైం: బాలల హక్కులు, వారి పరిరక్షణపై ప్రతీ ఒక్కరు స్పందించాల్సిన బాధ్యత ఉందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. 23వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలల హక్కుల కమిషన్ ఖమ్మంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో 0-18 సంత్సరాల బాలబాలికల పరిరక్షణ, బాలలపై హింస తదితర అంశాలపై బెంచ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశానికి ప్రతీ ఒక్కరు హాజరు కవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ బెంచ్ కార్యక్రమంలో బాలల హక్కులకు సంబంధించిన సమస్యలను ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారించే అవకాశం ఉంటుదని పేర్కొన్నారు. బాలకార్మిక వ్యవస్థ, బాల కార్మికులకు పునరావసం కల్పించకపోవడం, రహదారులలో బాలలు వస్తువులు విక్రయించడం, లేదా ఇతరులతో కలిసి రోడ్లపై కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ యాచక వృత్తి చేయటం, నిర్బంధిత పరిస్థితుల్లో యాచక వృత్తి చేయడం, ప్రసార మాధ్యమాల ద్వారా బాలల పట్ల హింసను ప్రచారం చేయడం తదితర అంశాలపై బెంచ్ నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ సునీల్ దత్ ప్రకటనలో తెలిపారు.

131
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles