అభివృద్ధిలో మధిర నెంబర్‌వన్ కావాలి

Wed,August 21, 2019 11:58 PM

-విద్య, వైద్యంపై అధికారులు దృష్టి సారించాలి
- అధికారుల మధ్య సమన్వయం ఉండాలి
-మిషన్ భగీరథ, రైతుబంధు పథకాలు దేశానికే ఆదర్శం
-అధికారుల సమీక్ష సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు

మధిర, నమస్తేతెలంగాణ, ఆగస్టు21: అభివృద్ధిలో మధిర నియోజకవర్గాన్ని నెంబర్‌వన్ స్థానంలో నిలపాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అధికారులతో పేర్కొన్నారు. బుధవారం మధిర పట్టణంలోని వర్తకసంఘం కళ్యాణ మండపంలో మధిర నియోజకవర్గస్థాయి అధికారులతో ఖమ్మం ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిధులు ఉన్నప్పటికీ పలుశాఖల అధికారులు పనులు పెండింగ్‌లో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యం, విద్య, వైద్యంపై అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడంతో జ్వరాలు ప్రభలే అవకాశం ఉందని, ఇంటింటికి తిరిగి యాంటీలార్వాపై అవగాహన కల్పించాలని తెలిపారు. కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సేవాదృక్పథంతో బాధ్యతగా తీసుకొని పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు సహకరించాలన్నారు. మిషన్‌భగీరథ, రైతుబంధు పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఇటువంటి పథకాలు దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాలను చూసి దేశ ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలు పెట్టారని పేర్కొన్నారు. ఈ పథకాలపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. మధిర మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.

ఎలాంటి పెండింగ్ సమస్యలు ఉండవద్దని ఆదేశించారు. వచ్చే సమీక్ష సమావేశానికి అధికారులంతా యాక్షన్‌రిపోర్టుతో రావాలని సూచించారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు, ఎంపీపీ మెండెం లలిత, జాయంట్ కలెక్టర్ అనురాగ్‌జయంతి, మధిర తహసీల్దార్ ఫూల్‌సింగ్, మధిర మున్సిపల్ కమీషనర్ దేవేందర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles