కొడుకులు వదిలేశారని...పోలీసులను ఆశ్రయించిన వృద్ధుడు

Fri,August 23, 2019 03:01 AM

చర్ల రూరల్‌: తన దగ్గర ఆస్తిపాస్తులు రాయించుకున్న కొడుకులు... అనారోగ్యంతో బాధపడుతున్న తనను పట్టించుకోవడంలేదని ఓ వృద్ధుడు చర్ల పోలీసులను ఆశ్రయించానే. చర్ల గ్రామానికి చెందిన బాధితుడు మాగంటి నారాయణ(80) గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో తన ముగ్గురు కొడుకులపై ఫిర్యాదు చేశారు. తన మొదటి భార్య చనిపోతే 40 సంవత్సరాల క్రితం రాఘవ అనే మహిళను వివాహం చేసుకొన్నానని పేర్కొన్నారు. రెండవ భార్యకి ఒక కుమార్తె కాగా, ఆమె 8 ఏళ్ళ క్రిందట చనిపోయిందని పేర్కొన్నారు. తన మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారని, ప్రస్తుతం వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తమ పొలం కౌలు ప్రతీ ఏటా వారే తీసుకొంటూ ఆస్తిపాస్తులు కూడా కాజేశారని పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా తన ఆరోగ్యం బాగాలేదని తెలిపారు. ఈ నెల 8న అనారోగ్యానికి గురికావడంతో రెండవ భార్య రాఘవ సహాయంతో చర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్‌ చేయగా ఆనాటి నుంచి నేటి వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నానని, తన కొడుకులకు ఫోన్‌చేసి చెప్పినా ఇంతవరకు చూడటానికి రాకపోగా, కనీసం ఆసుపత్రి బిల్‌ కూడా కట్టడానికి నిరాకరించారని పేర్కొన్నారు. నా కొడుకులకు ఆసుపత్రి నుంచి డాక్టర్లు ఫోన్‌చేస్తే తమకు సంబంధం లేదని, ఎవరు ఆసుపత్రిలో చేర్పించారో వారినే డిశ్చార్జి చేయించమని ఎంతో నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా ఆయన తన పిర్యాదులో పేర్కొన్నారు. తను ఆస్థులు సంపాదించి కొడుకులను చదివించి ప్రయోజకులనుచేసి ఆస్థిపాస్తులు అప్పగించి ఇపుడు తను అనాధగా బ్రతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పోలీసులే న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విచారించి తగు చర్యలు తీసుకొంటామని చర్ల ఎస్‌ఐ రాజువర్మ తెలిపారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles