ఖమ్మం టూటౌన్‌ సీఐగా తుమ్మా గోపి

Fri,August 23, 2019 03:02 AM

ఖమ్మం క్రైం: ఖమ్మం టూటౌన్‌ సీఐగా తుమ్మా గోపి బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం టూటౌన్‌లో సీఐగా పనిచేస్తున్నారు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐగా బదిలీ అయ్యారు. గురువారం ఆయన సీఐ నరేందర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, ఖమ్మం రూరల్‌, టూటౌన్‌, రఘునాథపాలెం పోలీస్‌ స్టేషన్‌లలో ఎస్‌ఐగా పనిచేశారు. సీఐ ఉద్యోగ ఉన్నతి పొంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల, కొత్తగూడెం టూటౌన్‌ సీఐగా పనిచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని పోలీస్‌స్టేషన్‌లో అమలు అయ్యే విధంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. టూటౌన్‌ పరిధిలో నిరంతర పెట్రోలింగ్‌, గస్తీ నిర్వహించి ప్రజలకు భద్రత చేపడతామని ఆయన తెలిపారు. శాంతి భద్రతల లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles