గణేష్‌ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

Fri,August 23, 2019 03:03 AM

అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వవద్దు: కలెక్టర్‌ కర్ణన్‌
ఖమ్మం నమస్తేతెలంగాణ: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు ప్లాస్టిక్‌ రహిత గణేష్‌ ఉత్సవాలను నిర్వహించాలని , గణేష్‌ నవరాత్రులు, ఉత్సవాలు, నిమజ్జనం శాంతి యుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఉత్సవ కమిటీలు సహకరించాలని కలెక్టర్‌ కర్ణన్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలపై స్తంభాద్రి ఉత్సవ కమిటీ, అనుబంధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్షంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో గణేష్‌ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు గాను పోలీస్‌, అగ్నిమాపక, విద్యుత్‌ , రెవెన్యూశాఖలచే ముందస్తు అనుమతి పొందాలని ,శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించాలని కమిటీ బాధ్యులకు కలెక్టర్‌ సూచించారు.గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలు, నిమజ్ఞనానికి జిల్లా యంత్రాంగం అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని కలెక్టర్‌ చెప్పారు.వివిధ శాఖల నిబంధనలు కచ్చితంగా పాటించి ముందస్తు అనుమతులు పొందాలని కలెక్టర్‌ సూచించారు.గణేష్‌ నిమజ్ఞనం తేదీని ఉత్సవ కమిటీ నిర్ణయించిన పిదప జిల్లా యంత్రాంగానికి తెలియచేయాలని అన్నారు.గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌రావు, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్‌ జె.శ్రీనివాసరావు, నగర ఏసీపీ వెంకట్రా వు, ట్రాఫిక్‌ ఏసీఫి సదానిరంజన్‌, కల్లూరు ఆర్‌డీఓ శివాజి, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ సోమిరెడ్డి, అగ్నిమాపక శాఖాధికారి ఎస్‌కే.కరీం, మత్స్యశాఖ ఏడీ బుజ్జిబాబు, నీటిపారుదల శాఖ డీఈ అర్జున్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వినోద్‌ లాహోటి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి,విద్యాసాగర్‌, కన్వీనర్‌ కె.ప్రసన్నకృష్ణ,అనుబంధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.


గణేష్‌ ఉత్సవాలను
విజయవంతంగా నిర్వహించాలి
అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వవద్దు: కలెక్టర్‌ కర్ణన్‌
ఖమ్మం నమస్తేతెలంగాణ: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు ప్లాస్టిక్‌ రహిత గణేష్‌ ఉత్సవాలను నిర్వహించాలని , గణేష్‌ నవరాత్రులు, ఉత్సవాలు, నిమజ్జనం శాంతి యుతంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఉత్సవ కమిటీలు సహకరించాలని కలెక్టర్‌ కర్ణన్‌ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలపై స్తంభాద్రి ఉత్సవ కమిటీ, అనుబంధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్షంచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో గణేష్‌ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు గాను పోలీస్‌, అగ్నిమాపక, విద్యుత్‌ , రెవెన్యూశాఖలచే ముందస్తు అనుమతి పొందాలని ,శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలు నిర్వహించాలని కమిటీ బాధ్యులకు కలెక్టర్‌ సూచించారు.గణేష్‌ నవరాత్రుల ఉత్సవాలు, నిమజ్ఞనానికి జిల్లా యంత్రాంగం అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని కలెక్టర్‌ చెప్పారు.వివిధ శాఖల నిబంధనలు కచ్చితంగా పాటించి ముందస్తు అనుమతులు పొందాలని కలెక్టర్‌ సూచించారు.గణేష్‌ నిమజ్ఞనం తేదీని ఉత్సవ కమిటీ నిర్ణయించిన పిదప జిల్లా యంత్రాంగానికి తెలియచేయాలని అన్నారు.
గణేష్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ అనురాగ్‌జయంతి, అడిషనల్‌ డీసీపీ మురళీధర్‌రావు, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్‌ జె.శ్రీనివాసరావు, నగర ఏసీపీ వెంకట్రా వు, ట్రాఫిక్‌ ఏసీఫి సదానిరంజన్‌, కల్లూరు ఆర్‌డీఓ శివాజి, ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ సోమిరెడ్డి, అగ్నిమాపక శాఖాధికారి ఎస్‌కే.కరీం, మత్స్యశాఖ ఏడీ బుజ్జిబాబు, నీటిపారుదల శాఖ డీఈ అర్జున్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వినోద్‌ లాహోటి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జి,విద్యాసాగర్‌, కన్వీనర్‌ కె.ప్రసన్నకృష్ణ,అనుబంధ శాఖల జిల్లా అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles