బాలల సమస్యలు కమిషన్‌ దృష్టికి తేవాలి

Fri,August 23, 2019 03:04 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జరిగే కమిషన్‌ శిబిరానికి అన్ని శాఖల జిల్లా అధి కారులు సకాలంలో తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ పర్యటన ఏర్పాట్లపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మొట్ట మొదటి సారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించాలన్నారు.జిల్లా అధికారుల దృష్టిలో ఉన్న బాలల సమస్యలను కూడా కమిషన్‌ దృష్టికి తేవాలని , విద్య, ఆరోగ్యం , సంక్షేమం, అభివృద్ధి అంశాలతో పాటు బాలల సమస్యలు, హక్కుల ఉల్లంఘనలపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులు పరిష్కార స్వభావాన్ని సూచించి కమిషన్‌ బెంచ్‌కు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు.

దీనితో పాటు శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విధ్యాశాఖకు సంబంధించిన స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదులు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు బాలల హక్కులపై పరిజ్ఞానం కలిగిన అధికారులను , సిబ్బందిని రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్ద అందుబా టులో ఉంచాలని శిశు సంక్షేమం, విద్యా శాఖాధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనుబంధ శాధికారులందరూ తమ విధులను బాధ్యతా యుతంగా చేపట్టి శిబిరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ సూచించారు.ఈ సమీక్షలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హన్మంతు కొడింబా, శిక్షణా కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్‌, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కన్సల్‌టెంట్‌ సభ్యులు అజీష్‌, అనుషాశర్మ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, బాలల సంరక్షణ అధికారి విష్ణువందన, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఇందుమతి, జిల్లా విద్యాశాఖ అధికారి మదన్‌మోహన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధాకారి డాక్టర్‌ కళావాతిబాయి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ నర్సింహారావు, జిల్లా ప్రధాన ఆసుపత్రి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి అలివేలు, బాల వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్‌ లీలావతి, అనుబంధ శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles