సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

Fri,August 23, 2019 03:08 AM

వెంకటవీరయ్య అన్నారు. గురువారం తల్లాడలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యా లయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. పినపాకకు చెందిన సుధాకర్‌రెడ్డికి రూ.2.50 లక్షలు, నూతనకల్‌కు చెందిన ప్రతా పరెడ్డికి రూ.1.50 లక్షలు, కుర్నవల్లికి చెందిన కృష్ణ రూ.19,500, బసవయ్యకు రూ.35,500, మరియమ్మకు రూ.24,500 చెక్కులను ఆయన అందజేశారు. అ నంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి నియోజక వర్గంలో ఇప్పటి వరకు సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా కోటి 50 లక్షల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. కల్లూరుకు చెందిన నంగునూరి వెంకటేశ్వరరావుకు రూ.15 లక్షలు ముఖ్యమంత్రి అందజేశారన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు గొప్ప వరమన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో రోజురోజుకు వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయన్నారు. లక్షల్లో వైద్యఖర్చులు అవుతుండటంతో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందు కుంటుందన్నారు. నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ 50 శాతం తగ్గకుండా ఖర్చులు మంజూరయ్యాయన్నారు. చిన్న ఆసుపత్రుల్లో చూపించుకున్నప్ప టికీ సరైన బిల్లులు తీసుకొస్తే దరఖాస్తు చేసుకుంటే సహాయం అందేలా చూస్తామన్నా రు.
రాజకీయాలకు అతీతంగా చేసే సామాజిక కార్యక్రమమే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నారు. ఈ నెల 27న నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 5 లక్షలు మొక్కలు నాటే మెగా హరితహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి హరితహారంలో నాటే మొక్కల లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. మొక్కలు బతికే చోటను నాటే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని మొక్కలు వేశామనే దానికంటే ఎన్ని మొక్కలు బతికించుకున్నామన్నదే ముఖ్యమన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రదేశాలను గుర్తించి విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు రాయల వెంకటశేషగిరిరావు, మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, మండల నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, దిరిశాల నరసింహారావు, దూపాటి భద్రరాజు, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారపోగు వెంకటేశ్వర్లు, షేక్‌ యూసుబ్‌, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, మువ్వా మురళీ, శీలం కోటారెడ్డి, బద్ధం కోటిరెడ్డి, దుండేటి కేశవరెడ్డి, అయిలూరి లక్ష్మీ, పోతురాజు కోటయ్య, కేతినేని చలపతి, గుండ్ల వెంకటేశ్వర్లు, ఉప్పెర్ల రామారావు, వేమిశెట్టి నాగన్న, తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles