వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

Fri,August 23, 2019 03:08 AM

మధిర, నమస్తేతెలంగాణ: మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీఅలివేలు మంగ పద్మావతి సమేత శ్రీవేం కటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం శ్రీనివాస కల్యాణాన్ని అం గరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పీటలపై కుర్చొని స్వామివారి కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ప్రధాన అర్చ కులు, పలువురు వేదపండితులు మంత్రోచ్ఛారణలతో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24న మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

110
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles