విద్యా, వైద్యానికే తొలి ప్రాధాన్యత..

Fri,August 23, 2019 03:10 AM

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా పరిషత్‌కు ఒక ప్రముఖస్థానం ఉన్నది. రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైన జడ్పీలలో ఖమ్మం ఒకటి. ఎంతో మంది రాజకీయ ఉద్దండులకు స్థానం కల్పించిన ఖమ్మం జిల్లా పరిషత్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పీఠంపై ఆశీనుడైన లింగాల కమల్‌రాజ్‌ తనదైన శైలిలో ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించింది. ఎంతోమంది నాయకులు జిల్లాలో ఉన్నప్పటికి టీఆర్‌ఎస్‌ పార్టీలోని నాయకులందరూ ఒకే మాటపై ఉండి లింగాలను జడ్పీచైర్మన్‌గా నియమించారు. ఉన్నత విద్యావంతుడు, నిజాయితీపరుడు, స్థానిక సంస్థల పాలనపై అవగాహన ఉన్న వ్యక్తిగా జిల్లా పరిషత్‌లో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ ముఖాముఖి.
నమస్తేతెలంగాణ: స్థానిక సంస్థల బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
జడ్పీచైర్మన్‌: సీఎం కేసీఆర్‌ స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా చట్టాలలో మార్పులు తీసుకువచ్చారు. గత ప్రభుత్వాల వైఫల్యం, అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వలన గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ దీనికి భిన్నంగా నూతనంగా పల్లెలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్థానిక సంస్థలకు నిధులివ్వబోతున్నారు. గ్రామాల అభివృద్ధ్దిలో పంచాయతీ పాలకవర్గంతో పాటు ప్రజల భాగస్వామ్యం పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం. పచ్చదనం పెంచేందుకు, రహదారుల అభివృద్ధి, శ్మశానవాటికల నిర్వహణ, హరితహారం, పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటాం

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles