కొత్త చట్టాలతో భారీ జరిమానాలు: ఏసీపీ

Fri,August 23, 2019 03:10 AM

ఖమ్మం క్రైం, ఆగస్టు 22: రానున్న ట్రాఫిక్‌ కొత్త చట్టాలపై అవగాహన కోసం ట్రాఫిక్‌ ఏసీపీ సదానిరంజన్‌ ఆధ్వర్యంలో గురువారం చర్యలు చేపట్టారు. ఖమ్మం నగరంలో తిరిగే ఆటో డ్రైవర్లకు, యజమానులకు గురువారం నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న ట్రాఫిక్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో అవగాహన సదసు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఏసీపీ సదానిరంజన్‌ మాట్లాడారు. త్వరలో అమలుకానున్న కొత్త వాహన చట్టంలో నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. నగరంలో తిరిగే ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు. ట్రాఫిక్‌ పోలీస్‌లు సూచించిన ప్రదేశాలలోనే ఆటోలు నిలుపుకోవాలన్నారు. ట్రాఫిక్‌ పోలీస్‌లు ఏర్పాటు చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఐడీ కార్డులు తప్పనిసరిగా మెడలో ధరించి ఉండాలని సూచించారు. రోడ్లపై ఆకస్మాత్తుగా ఆటోలను ఆపి ట్రాఫిక్‌కు అంతారాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్తగా అమలు కాబోయే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తామని ఆటో డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. ట్రాఫిక్‌ సీఐలు చిట్టిబాబు, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles