హోటళ్లపై సివిల్‌ సైప్లె అధికారుల దాడులు

Fri,August 23, 2019 03:11 AM

కొత్తగూడెం సింగరేణి: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని హోటళ్లపై సివిల్‌ సైప్లె అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌, సూపర్‌బజార్‌, గణేష్‌ టెంపుల్‌, పాల కేంద్రం, మెయిన్‌ ఆస్పత్రి ఏరియాల్లోని హోటళ్లు, మెస్‌లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, కర్రీ పాయింట్లపై నిర్వహించిన ఈ దాడుల్లో 21 డొమెస్టిక్‌ సిలిండర్లను స్వాధీనపర్చుకున్నారు. పదిమందిపై 6ఏ కేసు నమోదు చేశారు. గృహాల్లో వినియోగించే సిలిండర్లను వ్యాపారాలకు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారులంతా కమర్షియల్‌ సిలిండర్లను మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ఈ దాడుల్లో అసిస్టెంట్‌ సివిల్‌ సైప్లె ఆఫీసర్‌ రాజేందర్‌, డీటీ శివకుమార్‌ పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles