యువకుడి ఆత్మహత్య

Fri,August 23, 2019 03:12 AM

కరకగూడెం: అనారోగ్య సమస్యను తట్టుకోలేని ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రాజ్‌కమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లు మల్లిఖార్జునరెడ్డి (37), స్థానిక విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు కొన్నాళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల రెండుసార్లు కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అయినప్పటికీ ఆరోగ్యం ఎంతకీ కుదుటపడడం లేదు. బుధవారం రాత్రి తీవ్రమైన నొప్పి వచ్చింది. దీనిని తట్టుకోలేక, ఇంట్లో భద్రపరిచిన పురుగు మందు తాగాడు. కుటుంబీకులు భద్రాచలం పట్టణంలోని ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించాడు. అతడు అక్కడే మృతిచెందాడు. ఆయన భార్య స్వర్ణలత ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ దంపతులకు కుమార్తె ఉంది.
టేకులపల్లిలో వృద్ధుడు...
టేకులపల్లి: అనారోగ్య సమస్యను భరించలే వృద్ధుడు... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ తెలిపిన వివరాలు... టేకులపల్లి పంచాయతీ మూడుతండాకు చెందిన కంగాల రామయ్య(60), రెండేళ్ల నుంచి పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ సమస్యను భరించలేని రామయ్య, గురువారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసును ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు.

155
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles