జడ్పీలో స్టాల్స్ ప్రారంభించిన ఆనంద్..

Fri,August 23, 2019 11:10 PM

ఖమ్మం వ్యవసాయం : జిల్లా పరిషత్ సమావేశ మందిర ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. జిల్లా న్యాసేవాధికార సంస్థ, విద్యాశాఖ, లీడ్‌బ్యాంక్, ఐసీడీఎస్, పోషణ అభియాన్, బాలికా సంమృద్ధియోజన. వైద్యరోగ్యశాఖ, 1098-చైల్డ్‌లైన్ సంస్థలు పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ను బాలల హక్కుల పరిరక్షణ విభాగం కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆర్‌జీ ఆనంద్ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీస్ కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ప్రారంభించారు. ప్రతి స్టాల్స్‌ను ఆయన నిశితంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలికా సమృద్ధి యోజన పథకానికి చెందిన బాండ్లను పలువురు చిన్నారుల తల్లులకు అందించారు.

అనంతరం అంగన్‌వాడీ టీచర్లు తయారు చేసిన పోషకపదార్థాలను ఆయన స్వయంగా తిని రుచి చూడటం విశేషం. ఆయా సంస్థల ద్వార చిన్నారులకు అందిస్తున్న సేవలు, బాలల హక్కుల పరిరక్షణ, బాలికల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, సహాయ కలెక్టర్ హన్మంత్ కొడింబా, శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్, జిల్లా విధ్యాశాఖ అధికారి మధన్‌మోహన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆర్ వరలక్ష్మి, బాలల హక్కుల సంరక్షణ అధికారి టీ విష్ణువందన, లీడ్‌బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles