మత్స్య పరిశ్రమకు రూ.వెయ్యి కోట్లు

Fri,August 23, 2019 11:11 PM

కూసుమంచి, ఆగస్టు 23: తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని మత్స్యశాఖ కార్యదర్శి, పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉప సంచాలకుడు సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో మత్స్యసంపద పెంచడానికి చేప పిల్లల పెంపకం యూనిట్ల ఏర్పాట్లు, పెన్ కల్చర్, పాన్ (చేపగుడ్లు) కల్చర్, కేజ్ కల్చర్‌లను ఏర్పాటు చేయడంతోపాటు మత్స్యకారులకు వలలు, బోట్లు, వాహనాలు సమకూర్చుతామని వివరించారు. మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ మాట్లాడుతూ పాలేరు, నాయకన్‌గూడెం మధ్య స్థలం కేటాయిస్తే చేపల మార్కెట్ ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వీ.శ్రీనివాసరావు, ఏడీ బుచ్చిబాబు, వైరా ఎఫ్‌డీఓ శివప్రసాద్, నాయకన్‌గూడెం సర్పంచ్ కాసాని సైదులు, మత్స్యకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఉపేందర్, ఏడుకొండల్, మాజీ అధ్యక్షుడు పిల్లి రాంబాబు, పెన్‌కల్చర్ యూనిట్ ఆర్గనైజర్ వడ్డెబోయిన వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం
వ్యవసాయ రంగానికి దీటుగా మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మత్స్యశాఖ కార్యదరి సందీప్‌కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. పాలేరు మత్స్య పరిశోధన కేంద్రంలో 13 జిల్లాల మత్స్యకారులకు జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను శుక్రవారం కలెక్టర్ కర్ణన్‌తో కలిసి ఆయన పరిశీలించారు. మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్, కంపాసాగర్ కేవీకే శాస్త్రవేత్త జశ్వంతి తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles