హరితహార కార్యక్రమానికి కలెక్టర్‌కు ఆహ్వానం

Fri,August 23, 2019 11:11 PM

-పలు సమస్యలు కలెక్టర్‌కు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర
మయూరిసెంటర్, ఆగస్టు 23 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగే హరితహారం కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ కోరారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో ఆయనను కలిసి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో తమ నియోజకవర్గానికి హాజరుకావాలని కోరామన్నారు.

దీంతోపాటు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. సింగరేణి భూ నిర్వాసితులకు పాత విధానం ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించాలని, తమ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కార దిశగా కృషి చేయాలని సూచించారు. కొంత మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందలేదని, రెవెన్యూ యంత్రాంగం సరిగ్గా పనిచేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌తో నియోజకవర్గంలోని పలు సమస్యలు, కుర్నవల్లిలో పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేతో పాటూ నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకులు, తల్లాడ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles