పెండింగ్ కేసులు

Fri,August 23, 2019 11:12 PM

పరిష్కరించాలి : డీఆర్‌ఓ శిరీష
ఖమ్మం నమస్తేతెలంగాణ: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పెన్షన్ కేసులను ప్రాధాన్యత ప్రాతిపదికన, ప్రభుత్వ నిబంధనల పరిధిలో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శిరీష అన్ని ప్రభుత్వ శాఖల అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు సూచించారు. జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో నిర్వహించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమానికి డీఆర్‌ఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పెన్షన్‌దారుల ఇబ్బందులు తొలగించాలన్నారు. ఈ పెన్షన్ అదాలత్‌కు ఖజానా డిప్యూటీ డైరెక్టర్ బీ రవికుమార్, ఏజీ కార్యాలయం నుంచి ఏఏఓ శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కే వినయ్‌కుమార్‌లు పరిశీలకులుగా హాజరై పెన్షనర్ల సమస్యలను విని, వారినుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఓలు ఎం వెంకటేశ్వర్లు, వీ సత్యనారాయణ, ఎస్‌టీఓలు శారద, యల్.అశోక్‌రెడ్డి, ఎస్‌వీ కృష్ణారావు, సాయికుమార్, అన్ని శాఖల డీడీఓలు, పెన్షన్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles