జిల్లా వైద్యశాలలో శిశువు మృతి..

Fri,August 23, 2019 11:12 PM

మయూరి సెంటర్, ఆగస్టు 23: ఓ గర్భిణి ప్రసవం కోసం వచ్చి కాన్పు జరుగుతున్న సమయంలో జన్మించిన శిశువు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. మృత శిశువు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్య బంజరకు చెందిన కవిత తొలికన్పు కోసం ఈ నెల 21వ తేదీన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నెల 22వ తేదీన గర్భిణీ కవితకు ప్రసవ తేదీని సదరు వైద్యులు చెప్పారని, నొప్పులు వస్తున్నప్పటికీ శస్త్రచికిత్స చేసి పురుడుపోస్తే శిశువు బతికి ఉండేదని, ఇక్కడి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సాధారణ కాన్పు జరుగుతది, కంగారు చెందాల్సిన అవసరం లేదని చెప్పి శిశువు ప్రాణాలు వదిలే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నెల 21వ తేదీ నుంచి గర్భిణి కవితకు 23వ తేదీ ఉదయం వరకు ప్రసవ నొప్పులు వస్తున్నప్పటికీ నిర్లక్ష్య ధోరణిలో వైద్య యంత్రాంగం వ్యవహరించిందని ఆరోపించారు.

అనంతరం మృత శిశువుతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న సమావేశంలో కేంద్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వద్దకు హాజరుకాగా అక్కడే ఉన్న స్థానిక (స్కోప్ ఆర్‌డీ) సంస్థ చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ప్రసాద్, ప్రతినిధులు స్వరూప్‌లకు వివరాలు తీసుకోవాలని సూచించగా స్కోప్ ఆర్‌డీ ప్రతినిధులు జిల్లా వైద్యశాలకు వెళ్లి సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం శిశువు మృతికి గల కారణాలు, గర్భిణీ కవితకు అందజేసి ఆరోగ్యసేవలకు చెందిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి సూపరింటెండెంట్ ఆపత్రాలను స్కోప్ ఆర్‌డీ సభ్యులకు అందజేశారు. టూటౌన్ పోలీసులు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఆందోళన జరగకుండా బాధితులను సముదాయించారు.

సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉంది..
గర్భిణి కవితకు సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉంది. కాగా శుక్రవారం ఉదయం కవితకు పురిటినొప్పులు వస్తున్న నేపథ్యంలో వైద్యులు కూడా సకాలంలోనే అందుబాటులో ఉన్నారు. అయితే ప్రసవ సమయంలో బేబీ (ఆడ శిశువు) తలభాగం వరకు మాత్రమే ప్రసవం జరగగా, అలాంటి సమయాల్లో శస్త్రచికిత్స నిర్వహించడం సాధ్యం కాదు. ఈ క్రమంలో శిశువు మృతి చెందింది. -డాక్టర్ బీ వెంకటేశ్వర్లు, మెడికల్ సూపరింటెండెంట్

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles