ఆవిష్కరణలతోనే అభివృద్ధి...

Sun,August 25, 2019 12:24 AM

-ఇంపాక్ట్ ముగింపు సభలో వక్తలు
ఖమ్మం కల్చరల్: నూతన పరికల్పనలు, ఆవిష్కరణలతోనే అభివృద్ధి ముడిపడి ఉందని, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబె ట్టాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రోటరి క్లబ్ ఆఫ్ స్తంభాద్రి, జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ సంయుక్తంగా నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన ఇంపాక్ట్-19 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత దేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చెందాలంటే విద్యార్థులు, యువత నూతన పరికల్పనలు, ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కొరియా, జపాన్, చైనాలాంటి దేశాలు ఒక ప్రత్యేక సాంకేతికతతో ప్రపంచాన్ని శాసిస్తుంటే, అన్ని వనరులున్న మన దేశం వెనుకబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే నిజాయితీ, నిబద్ధత ఉండాలన్నారు. ఏదైనా సాధించగలిగే శక్తి యువతకే ఉంటుందని, చాలా చైతన్యమైన యువ దశను నిర్వీర్యం చేసుకోకూడదన్నారు. ఏపీ అడిషనల్ ఎస్‌పి సరిత మాట్లాడుతూ కెరీర్‌కు వివాహం, ఆర్థిక, సామాజిక పరిస్థితులు మరేవీ అడ్డురావని, వీటన్నింటిని అధిగమించి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే జీవితమన్నారు.పరిపక్వత లేని ప్రేమలొద్దని, ప్రపంచాన్ని మార్చే దశ, దిశ గల ధృడ సంకల్పం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ కార్యక్రమం కన్వీనర్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇంపాక్ట్ నిర్వహిస్తూ, విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో రోటరిక్లబ్ ప్రముఖ పాత్ర వహించడం గర్వకారణమన్నారు. మరో మోటివేటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ నీ భయమే విలన్ అని, చెడు అలవాట్లు కెరీర్‌కు అవరోధమని చెప్పారు. మోటివేటర్లు నర్సింహారెడ్డి, రాజశేఖర్, కిషన్ నాయక్‌లు విద్యార్థుల ఎదుగుదలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ, ఏఎస్పీ సరిత, ఎమ్మెల్యే అజయ్, ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం ఉమామహే శ్వరరావులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు, ప్రొగ్రాం కన్వీనర్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్ వేములపల్లి సీతారాంబాబులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో రోటరి క్లబ్ అధ్యక్షుడు చెరుకూరి యుగంధర్, కార్యదర్శి బొమ్మిడి సునీల్, జర్నలిస్ట్ ప్రసేన్, ఎన్‌ఆర్‌ఐ జిల్లా అధ్యక్షుడు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, రంగారావు, పాలవరపు శ్రీనివాసరావు, నాగసాయి నగేష్, జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

141
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles