చిరకాలం గుర్తుండేలా సేవలు అందించండి

Sun,August 25, 2019 12:24 AM

ఖమ్మం వ్యవసాయం:పంటకు మద్దతు ధర కల్పించి చిరకాలం రైతుల మనస్సులలో గుర్తుండే విధంగా స్థా నం పొందాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం టీఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం మార్కెట్ కమిటీ పాలకవర్గానికి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు సన్మానం జరిగింది. కార్మిక విభాగం నాయకుడు నున్నా మాధవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత ఎమ్మెల్యే పువ్వాడకు, చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు పసుమర్తి రాంమోహన్‌రావు, అంకిత మహేందర్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పువ్వాడ మాట్లాడుతూ.. మద్దినేనికి మార్కెట్ కమి టీ చైర్మన్ పదవీ రావడం పువ్వాడ మనిషిగా కాదన్నారు. దాదాపు రెండేళ్ల కాలంలో నాలుగు ఎన్నికలు రావడం జరిగిందన్నారు. మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్న మద్దినేని ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలలో తిరుగులేని మెజార్టీ తీసుకరావడం జరిగిందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు రావడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికైన పాలకవర్గం సభ్యులు మొత్తం రైతుకుటుంబం నుంచి వాచ్చిన వారే అన్నారు. అలాంటి వారు కాబట్టే ఎన్నిక చేయడం జరిగిందన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles