జమలాపురం ఆలయంలో పోటెత్తిన భక్తులు

Sun,August 25, 2019 12:26 AM

ఎర్రుపాలెం: జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం శ్రావణమాసం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేలుకొలిపి పంచామృతాలతో అభిషేకించి నూతన వస్ర్తాలు ధరింప చేసి పూలమాలలు, తులసిమాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శింప చేశారు. స్వామివారికి గణపతిపూజ, పుణ్యహవచనం, అంకు రారోపణ, మండప దేవతల ఆహ్వానం, ఆవాహిత దేవతల హోమం తదితర పూజాకార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల వెంకటజయదేవశర్మ, కార్యనిర్వహణ అధికారి పీ.ఉదయ్‌భాస్కర్, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, విజయదేవశర్మ, సుదర్శన్‌శాస్త్రీ, రా మకృష్ణశాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు కోనా చంద్రశేఖర్, సిబ్బంది విజయ కుమారి, ఆంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles