హరిత తెలంగాణే కేసీఆర్ ధ్యేయం

Sun,August 25, 2019 11:30 PM

వైరా, నమస్తే తెలంగాణ: హరిత తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. హరితహారం స్ఫూర్తితో మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన ప్రసన్నాంజనేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు 500 కొబ్బరి మొక్కలను ఆదివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్క నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మొక్కలను పెంచడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. మొక్కల ప్రయోజనాన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వివరించాలని కోరారు.

మొక్కలు పంపిణీ చేసిన ప్రసన్నాంజనేయ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీడీవో రమాదేవి, ఎస్‌ఐ తాండ్ర నరేష్, సర్పంచ్ ఇటుకల మురళి, టీఆర్‌ఎస్ నాయకులు గుమ్మా రోశయ్య, పసుపులేటి మోహన్‌రావు, బాణాల వెంకటేశ్వరరావు, ముళ్ళపాటి సీతారాములు, శ్రీరామినేని తిరుపతిరావు, ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ నిర్వాహకులు అమరనేని మన్మథరావు, వేంసాని వెంకటేశ్వరరావు, గంగవరుపు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

128
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles