గిరిజన వసతి గృహాల్లో ఆధునిక వంటశాలలు

Sun,August 25, 2019 11:30 PM

మామిళ్లగూడెం: గిరిజన సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ వసతి గృహాల్లో ఆధునిక వంటశాలల ఏర్పాటుకు నిర్ణయయించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సంక్షేమ రంగంలో విద్య, వసతులకు పెద్ద పీట వేసింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు వసతుల కల్పన శరవేగంగా సాగుతోంది. అన్ని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడంతో పాటు రుచికరమైన భోజనం తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో దశలవారీగా స్టీమ్ పరికరాలతో వంట తయారు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఒక్కో వసతి గృహంలో 3.10లక్షల రూపాయల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

వసతి గృహాల్లో ఇలాంటి ఆధునిక వంటశాలలు అందుబాటులోకి రావడంతో విద్యార్థులకు సకాలంలో భోజనం అందడంతోపాటు నాణ్యమైన వేడి వేడి భోజనం తినేందుకు అవకాశం ఏర్పడనుంది. ఖమ్మం జిల్లాలో 18 పాఠశాలల స్థాయి వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, 12 కళాశాల స్థాయి వసతి గృహాల్లో ఈ వసతులు ఏర్పాటు కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64 పాఠశాలల స్థాయి వసతి గృహాలు, ఆశ్రమ పాఠాలలు, 22 కళాశాలల స్థాయి వసతి గృహాల్లో ఆధునిక వంట సౌకార్యాలకు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఆధునిక వంటశాలల ఏర్పాటు పూర్తికావస్తున్నది. ఈ వంటశాలలను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం రాత్రి పరిశీలించారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles