రామాలయంలో ఘనంగా ఉట్ల పండుగ

Sun,August 25, 2019 11:30 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఆదివారం సాయంత్రం ఉట్ల పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి పల్లకీపై స్వామివారిని ఊరేగింపుగా చిత్రకూట మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు ఉట్ల తాడును లాగి ఉట్ల పండుగను ప్రారంభించారు. దీంతో ఉత్సాహవంతులు ఈ వేడుకలో పాల్గొని ఉట్టికొట్టి సంబురాలను పంచుకున్నారు. అక్కడ నుంచి స్వామివారిని తిరువీధి సేవగా తాతగుడి సెంటర్ వద్దకు తీసుకొచ్చారు. రాజవీధిలోని పలు చోట్ల ఉట్ల వేడుకను కనుల పండువగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles