తాలిపేరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తివేత

Sun,August 25, 2019 11:31 PM

చర్ల రూరల్: తాలిపేరు ప్రాజెక్టులో ఆదివారం అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 12,560 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 12,700 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లుగా తాలిపేరు ప్రాజెక్ట్ట్ ఇన్‌చార్జి ఏఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో 73.23 మీటర్ల నీటిని నిల్వచేసి అదనపు నీటిని గేట్లు ఎత్తి వదిలేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు ప్రధాన ఎడమ, కుడి కాలువల ద్వారా పంట పొలాలకు 140 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈఈ తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు నీటి ద్వారా 24,700 ఎకరాల్లో వరి ప్రతీఖరీఫ్‌లో సాగుచేస్తారు. ఇప్పటికే మూడు వంతుల వరి నాట్లు పూర్తయ్యాయి.

139
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles