తల్లి చేపల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి

Sun,August 25, 2019 11:31 PM

కూసుమంచి: హేచరీల నిర్వాహకులు తల్లిచేపల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకే శాస్తవేత్త జి.ప్రభాకర్ తెలిపారు. పాలేరులోని మత్స్యపరిశోధన కేంద్రంలో 13 జిల్లాల మత్స్యకారులకు జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణలో ఆదివారం ఆయన తల్లిచేపల ఎంపిక, రవాణా తదితర అంశాలపై వివరించారు. కొర్రెమీను చేపకు డిమాండ్ అధికంగా ఉంటుందని, దీనిపిల్లలను ఉత్పత్తి చేయదలిచిన హేచరీల నిర్వాహకులు కనీసం ఏడాది వయస్సు ఉన్న తల్లిచేపలను ఎంపికచేసుకోవాలన్నారు. కొలనుల్లో కొర్రమేను చేప గుడ్లు పెట్టడానికి గడ్డి అందుబాటులో ఉంచాలని, గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన మూడు,నాలుగు రోజుల తర్వాత వాటిని తల్లిచేపల నుంచి వేరుచేయాలని సూచించారు. కొర్రమేను చేపలు స్వయంభక్షక అలవాటు కలిగి ఉంటాయని, పిల్లలు అందుబాటులో ఉంటే వాటిని తినేస్తాయని, అందువల్ల ఈజాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

కొర్రమేను పిల్లలకు ఆర్టిమియా, ట్యూబీపెక్స్ వంటి పురుగులను ఆహారంగా అందిస్తే బతుకుదల శాతం పెరుగుతుందని చెప్పారు. అశ్వారావుపేట బ్లాక్ ఆత్మ టెక్నికల్ మేనేజర్ జీ. శ్రీనివాసరావు చేపపిల్లల ఎంపిక, రవాణా విధానాలను వివరించారు. గాయాలులేని, చురుకైన చేపపిల్లలను ఎంపికచేసుకోవాలన్నారు. రవాణా సమయంలో చేపల నుంచి అధికంగా వ్యర్థాలు వెలువడకుండా చూడాలని తెలిపారు. నీరు వేడెక్కితే, మార్గమధ్యంలో వాటి మార్చాలని సూచించారు. సీనియర్ శాస్త్రవేత్త విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి నాణ్యత, మేతయాజమాన్యం తదితరాలపై అవగాహన ఉండాలన్నారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles