మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసిన ఎంపీ నామా

Sun,August 25, 2019 11:31 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా హైద్రాబాద్‌లో ఆదివారం కలిసిన టీఆర్‌ఎస్ లోక్‌సభపక్ష నేత, ఖమ్మం టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాల అభివృద్ది పై జరిపిన సమీక్ష సమావేశం అనంతరం మంత్రిపి ఎంపీ నామా కలిశారు. అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ పథకాలను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక శాతం ఉన్న గిరిజన, ఆదివాసీలకు భారీగా సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, బీసీ సబ్ ప్లాన్ నిధులు, పెండింగ్‌లో ఉన్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల చేయాలని తెలిపారు.

ఖమ్మం జిల్లా పర్యటనలో అశ్వారావుపేట మైనార్టీ గురుకులంలో మౌళిక వసతుల కల్పన కోసం ఎంపీ ల్యాడ్స్ కింద లక్ష రూపాయలు కేటాయిస్తానని ప్రకటించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మధిర గురుకులాన్ని సందర్శించానని, అక్కడున్న వసతులు, విద్యా బోధన చక్కగా సాగుతుప్పదని మంత్రితో చెప్పారు. గురుకులాలల్లో వీలుంటే సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందాల్సిన సంక్షేమ పథకాలు అన్ని అందిస్తామని ఎంపికి మంత్రి హామినిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్, నాయకులు తదితరులున్నారు.

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles