హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయం

Sun,August 25, 2019 11:34 PM

-మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ
-ప్రతీ ఇంట్లో మొక్కలు నాటి గ్రామాలను వనాల్లా మార్చాలి
-మొక్కలు నాటడంలో వైరాను అగ్రస్థానంలో నిలుపుదాం
-ఎమ్మెల్యే రాములునాయక్
వైరా, నమస్తే తెలంగాణ: హరిత తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. హరితహారం స్ఫూర్తితో మండలంలోని అష్ణగుర్తి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన ప్రసన్నాంజనేయ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు 500 కొబ్బరి మొక్కలను ఆదివారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్క నాటారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మొక్కలను పెంచడం ద్వారానే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. మొక్కల ప్రయోజనాన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ వివరించాలని కోరారు. మొక్కలు పంపిణీ చేసిన ప్రసన్నాంజనేయ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీడీవో రమాదేవి, ఎస్‌ఐ తాండ్ర నరేష్, సర్పంచ్ ఇటుకల మురళి, టీఆర్‌ఎస్ నాయకులు గుమ్మా రోశయ్య, పసుపులేటి మోహన్‌రావు, బాణాల వెంకటేశ్వరరావు, ముళ్ళపాటి సీతారాములు, శ్రీరామినేని తిరుపతిరావు, ప్రసన్నాంజనేయ స్వామి ట్రస్ట్ నిర్వాహకులు అమరనేని మన్మథరావు, వేంసాని వెంకటేశ్వరరావు, గంగవరుపు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

పెనుబల్లి: హరిత తెలంగాణ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్ స్వగ్రామం ఏరుగట్లలో ఆదివారం పోలీస్, రెవెన్యూ, లయన్స్ క్లబ్, అంగన్‌వాడీ, ఈజీఎస్, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ... నాటిన మొక్కలను సంరక్షించడమే ప్రధానమని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు చెక్కిలాల మోహన్‌రావు, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, ఆర్‌ఐ జానిమియా, ఈఓఆర్డీ వాల్మీకి కిషోర్, ఏఓ ప్రసాదరాజు, ఈజీఎస్ ఏపీఓ కాసర్ల పద్మయ్యనాయుడు, సీఐ రవికుమార్, ఎస్‌ఐ తోట నాగరాజ, సర్పంచ్‌లు తావూనాయక్, శంకర్, లక్కినేని శ్యామలాదేవి, ఎంపీటీసీ సభ్యులు కనగాల సురేష్‌బాబు, నారుమళ్ళ లక్ష్మీబాబు, ఐసీడీఎస్ ఏసీడీపీవో మెహరున్నీషా బేగం, సూపర్‌వైజర్ మహాలక్ష్మి, నాయకులు చీకటి రామారావు, కనగాల వెంకటరావు, ముక్కెర భూపాల్ రెడ్డి, చింతనిప్పు సత్యనారాయణ, సీనియర్ నాయకులు లక్కినేని జోగారావు, బెల్లంకొండ చలపతిరావు, తాళ్లూరి శేఖర్‌రావు, నల్లమోతు వెంకటేశ్వరరావు (పెద్దబాబు), గిరిజ, వేముల కృష్ణయ్య, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles