గ్రామం అభివృద్ధిలో సర్పంచ్‌దే కీలకపాత్ర

Wed,September 4, 2019 11:43 PM

-సీఎం కేసీఆర్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగాలి
-గ్రామాలను బాగుచేసుకునే సువర్ణ అవకాశం వచ్చింది
-జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్
-ప్రజలను భాగస్వామ్యం చేయాలి
-వైరా, పాలేరు ఎమ్మెల్యేలు లావుడ్యా రాములు నాయక్, ఉపేందర్‌రెడ్డి
-ఈ నెల 12 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రణాళిక అమలు: కలెక్టర్ కర్ణన్

ఖమ్మం, నమస్తేతెలంగాణ: మన పల్లెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది.. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు గ్రామ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నా రు. పల్లెల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై బుధవారం భక్తరామదాసు కళాక్షేత్రంలో సర్పంచ్‌లకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, మండల ప్రత్యేక అధికారులకు , పంచాయతీ అధికారులకు, అటవీ, విద్యుత్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికా రులకు అవగాహన సదస్సును కలెక్టర్ అధ్యక్షతన నిర్వహిచారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేందుకు నియంత్రిత పద్ధతుల్లో , విస్త్రృత ప్రజా భాగ స్వామ్యంతో ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆకాంక్షించిన మేరకు 30 రోజుల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలలో అవసరమైన పనులు గుర్తించి, వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందిం చాలన్నారు.తదనుగుణంగా పనులు చేపట్టేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు సేవా దృక్పథంతో పనిచేయాలని కమల్‌రాజు అన్నారు.

మన గ్రామాలను మనమే బాగుచేసుకునే సువర్ణ అవకాశం లభించిందని, ప్రభు త్వం పంచాయతీలకు కల్పించిన విస్తృత అధికారాలను పూర్తిగ సద్వినియోగం చేసుకొని 30 రోజుల ప్రణాళికతో గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన అన్నారు. పారిశుధ్య పనులను ముమ్మరం చేయడం, హరితహారం క్రింద మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవడం, గ్రామాలలోఏని విద్యుత్ దీపాలకు సంబంధించిన మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు గ్రామాలలో గుర్తించిన ఇతన అవసరమైన పనులను 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో రూపొందించుకొని సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపట్టేందుకు సర్పంచ్‌లు సహకరించాలని అన్నారు.

సర్పంచ్‌కు విశిష్ట అధికారాలు: కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్‌కు పలు విశిష్ట అధికారాలు, విలువలు కల్పించబడ్డాయని, గ్రామ సభ తీర్మానం ద్వారా గ్రామాభివృద్ధి పనులు చేపట్టే నిర్ణయాధికారులు కల్పించడం జరిగిందని కలెక్టర్ కర్ణన్ అన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ అమలుపై సర్పంచ్‌లు తమ గ్రామాలను తామే అభివృద్ది చేసుకునే విధంగా పనులను గుర్తించి ప్రణాళికలను రూపొందించుకొని తదనుగుణంగా పనులు చేపట్టాలన్నారు.గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను విడుదల చేస్తుందన్నా రు.గ్రామ పంచాయతీ నిధుల నుంచి పది శాతం నిధులను తప్పనిసరిగా హరితహారానికి వినియోగించాలని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ఎన్ ఆర్‌జీఎస్ నిధులను కూడా పూర్తిగా సర్పంచ్ నియంత్రణలోకి మార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.

30 రోజుల ప్రణాళిక భాగంగా ఈ నెల 6వ తేదీన గ్రామ సభ నిర్వహించడం, 7న స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక, 8,9 తేదీలలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, పంచాయతీ అధికారులు, సిబ్బంది, మండల ప్రత్యేక అధికారులు, గ్రామ ప్రజలు పూర్తిగా గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించాలన్నారు. 10న కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి 11న గ్రామ సభ ఆమోదం పొందా లన్నారు.ఈ నెల 12 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.డంపింగ్ యార్డులు, శ్మశానవాటికోసం ప్రభుత్వ స్థలాలను అప్పగిస్తామని, ప్రభుత్వ స్థలాలు లేని చోట ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసే అధికారాలను కూడా గ్రామ పంచాయతీలకు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలవని, మనం వినియోగించే నీరు , ఇం ట్లోని నీటి నిల్వల ద్వారా దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతాయని వాతావరణ మార్పులవల్ల సంభంవించే వ్యాధుల పట్ట ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.

హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీలలో గ్రామ సభల ద్వారా మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ తప్పనిసరిగా ఉండాలన్నారు.ప్రతి ఇంటికి కనీసం ఆరు మొక్కలు గృహ అవసరాలకు ఉపయోగపడే పండ్ల, ఔషధ మొక్కలను పంపిణీ చేయాలన్నారు.30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కేవలం నెల రోజులకే పరిమితం కాదని నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం, నిధుల సద్వినియోగం, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు నిర్వహించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిదుల సహకారంతో నిబద్ధతతో పనిచేసి ఖమ్మం జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.30 రోజులలో గ్రామాలలో జరిగిన ప్రణాళిక అమలుకోసం సీనియర్ అధికారుల నేతృత్వంలో ఫ్లయింగ్ స్కాడ్‌లు గ్రామాలలో ఆకస్మిక తనిఖీలు చేపడ్తా యన్నారు.అజాగ్రత్త, అలసత్వం ప్రదిర్శంచిన వారిపై చర్యలు తీసుకుంటారని కలెక్టర్ అన్నారు.అదేవిధంగా లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహాకాలను అందించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా సదస్సు కు హాజరైన వారికి కార్యాచరణ ప్రణాళిక అమలుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారి రాంబాబు అవగాహన కల్పించారు.

ప్రజలను భాగస్వామ్యం చేయాలి
వైరా, పాలేరు ఎమ్మెల్యేలు లావుడ్యా రాములు నాయక్ కందాల ఉపేందర్‌రెడ్డి గ్రామాల అభివృద్ధికి 30 రోజులలో చేపట్టే పనులను ముఖ్యమంత్రి చేసిన దిశ నిర్దేశనికి అనుగుణంగా జిల్లాలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు యుద్ధప్రాతిపధికన ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని వైరా, పాలేరు శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డిలు అన్నారు.ప్రజలతో మమేకమై నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న జిల్లా కలెక్టర్ నాయకత్వంలో జిల్లా అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, అనుబంధ శాఖల అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని జిల్లాలోని పల్లె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు.ప్రజలకు సేవ చేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు పనిచేయాలని ముఖ్య మంత్రి ఆశించిన స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు కోరారు.ఈ అవగాహన సదస్సులో సహాయ కలెక్టర్ హన్మంతు కొడింబా శిక్షణ కలెక్టర్ ఆదర్శసురభి, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా అట వీశాఖ అధికారి ప్రవీణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ రమేష్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఇందుమతి, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, అటవీ, విద్యుత్, ఎన్‌ఆర్‌జీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

230
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles