ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

Fri,September 6, 2019 12:52 AM

ఏన్కూరు:ఏన్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రధా నోపాధ్యాయురాలు ఏ శైల, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సాగి సు జాత, వైరా మండలం గన్నవరం హెచ్‌ఎం కే సదయ్యలు గురు వారం హైదరాబాద్ రవీంద్రభారతీలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందు కున్నారు.

కారేపల్లి రూరల్:సింగరేణి మండల పరిధిలోని రొట్టమాకురేవు గ్రామానికి చెందిన కవి యాకూబ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. గురుపూజోత్సవ సందర్భంగా గురువారం హైద రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కవి యాకూబ్‌ను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికచేసింది. ప్రభుత్వ ఉత్తమ అధ్యాపకునిగా కవి యాకూబ్ ఎంపిక పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles