గ్రామాలు అభివృద్ధి బాట పట్టాలి..

Fri,September 6, 2019 12:53 AM

బోనకల్లు: రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. గురువారం పల్లెప్రగతికి 30 రోజుల ప్రణాళిక కార్యచరణ చేపట్టేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు క్రియాశీలక బాధ్యత పోషించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. దీనికోసం 30 రోజుల ప్రణాళిక రూపొందించి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక ఛాలెంజ్‌గా తీసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. రాష్ర్టానికి సీఎం ఒక ప్రజాసేవకుడిగా ఉండాలన్న ఆలోచనతో ఉన్నారని, దీనికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు కూడా కట్టుబడి ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాల సమస్యల పరిష్కారం కోసం ప్రతిఒక్కరు పనిచేయాలని సూచిం చారు. 30 రోజుల ప్రణాళిక కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించిం దని, ఈ బడ్జెట్‌లో 10 శాతం హరితహారానికి కేటాయించేలా చర్యలు తీసుకుందన్నారు. ప్రజల అవసరాలను దృ ష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికలో గ్రామా ల్లో ఉన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి పరిష్కార మా ర్గాలు వేయాలన్నారు.

ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని క మల్ రాజు అన్నారు. మం డల పరిషత్ కార్యాలయ ఆ వరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మో దుగుల సుదీర్, ఎంపీడీవో జీ.శ్రీదేవీ, తహసీల్దార్ ఎ.రమేష్, ఎన్‌ఎస్పీ డీఈ ప్రేమ్‌చంద్, టీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రైతుసంఘం జిల్లా సమితి సభ్యులు మందడపు తిరుమలరావు, మండల కార్యద ర్శి పారా ప్రసాద్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు కిన్నెర పాపారావు, సర్పంచ్‌లు భుక్యా సైదానాయక్, షేక్ బీజాన్‌బీ, చిలకా వెంకటేశ్వర్లు, జర్రిపోతుల రవీందర్, కొమ్మినేని ఉపేందర్, బో నకల్లు ఎంపీటీసీ గుగులోతు రమేష్, కలకోట ఎంపీటీసీ యం గల మార్తమ్మ, చిరునోముల ఎంపీటీసీ కోటపర్తి హైమావతి, కోయినేని ప్రదీప్, ఇటికాల శ్రీనివాసరావు, గుడిపుడి రామకృష్ణ, బోయినపల్లి మురళీ, కంచర్ల బాబు, బంధం సీతరాములు పాల్గొన్నారు.

173
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles