సంగయ్య మృతికి నివాళి

Fri,September 6, 2019 12:54 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 5 : రూరల్ మండలం తనగంపాడు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భట్టు సంగయ్య(60) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న రూరల్ మండల పార్టీ నాయకుడు అల్లిక వెంకటేశ్వరరావు ఎంపీటీసీ అల్లిక వెంకటరమణి, సొసైటీ చైర్మన్ మంకెన నాగేశ్వర్‌రావులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. భట్టు సంగయ్య మరణం పార్టీకి తీరనిలోటు అని మండల నాయకుడు అల్లిక వెంకటేశ్వరరావు అన్నారు. నివాళులర్పించిన వారిలో స్థానిక నాయకులు జర్పుల లక్ష్మణ్, లింగయ్య తదితరులు ఉన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles