టాస్క్‌ఫోర్స్ సభ్యురాలిగా సర్పంచ్ ఎంపిక

Fri,September 6, 2019 12:54 AM

కారేపల్లి, సెప్టెంబర్ 5 : ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పనా పథకం(పీఎంఈజీపీ)ద్వారా దరఖాస్తు చేసుకున్న ధ్రువపత్రాలను పరిశీలించేందుకు గాను జిల్లా కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ పది మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమించారు. అందులో భాగంగా స్థానిక సంస్థల కోటాలో జిల్లా వ్యాప్తంగా ముగ్గురు సర్పంచ్‌లను కమిటీలోకి తీసుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గంతో పాటు ఉన్నత విద్యావంతురాలైన కారేపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఆదెర్ల స్రవంతికి అవకాశం లభించింది. దీంతో జాయింట్ కలెక్టర్ సమక్షంలో జరిగిన మొదటి దపా దరఖాస్తుల పరిశీలనలో కారేపల్లి సర్పంచ్ పాల్గొన్నారు.

166
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles