శాస్త్రీయ నైపుణ్యాలు పెరగాలి

Fri,September 6, 2019 11:59 PM

ఖమ్మం ఎడ్యుకేషన్: విద్యార్థులలో శాస్త్రీయ నైపుణ్యాలను పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం నగరంలోని ఆర్‌ఆర్ పాఠశాలలో చంద్రయాన్-2 నమూనా ప్రదర్శనను నిర్వహించారు. ఉపాధి కల్పనాధికారి శ్రీరాం, కమిషనర్ శ్రీనివాసరావులు ముఖ్యఅతిథులుగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. చంద్రయాన్-2 ద్వారా చంద్రునిపై జీవించడానికి అవకాశాలను వెల్లడిస్తుందన్నారు. ఇస్రో నిర్వహించిన ప్రయోగాన్ని విద్యార్థులు నమూనా ప్రదర్శన రూపంలో కండ్లకు కట్టినట్లుగా వివరించారు. కార్యక్రమంలో చైర్మన్ తాళ్లూరి మధుసూదన్, డైరెక్టర్ సత్యనారాయణ ప్రసాద్, హెచ్‌ఎం కృష్ణలత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

161
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles