దేశంలో హరితవిప్లవం విస్తరించాలి

Fri,September 6, 2019 11:59 PM

ఖమ్మం కల్చరల్:దేశంలో హరిత విప్లవం విస్తరిస్తే, రైతుల సంక్షేమంతో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతాయని హరితవిప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ తెలంగాణ కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పగిడిపల్లి రాజారావుకు సూచించారు. శుక్రవారం చెన్నైలోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఆయనను కలిసిన రాజారావుతో పలు రైతు సమస్యలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. భవిష్యత్‌లో రావాల్సిన హరిత విప్లవం, దాని ప్రభావాలను వివరించారు. స్వామినాధన్ అధ్యక్షతన రూపొందించిన నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ చేస్తున్న అధ్యయనాలు, ప్రణాళికలను ప్రభుత్వాలు అమలుపరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు.

హరితవిప్లవం దిశలో తెలంగాణ కళాపరిషత్ కృషి చేయాలని, తెలంగాణ కళలను సీఎం కేసీఆర్ ఎంతో ప్రోత్సహిస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలని రాజారావుకు సూచించారు. తెలంగాణ కళలు ఎంతో ప్రభావితం చేస్తాయని, వ్యవసాయం, రైతాంగంపై ఈ కళలు మరిన్ని జాగృత కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. తాను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సేవ్ ఫార్మర్, బిల్డ్ నేషన్‌కు విశేషస్పందన ఉందని రాజారావు స్వామినాథన్‌కు వివరించారు. ఈ సందర్భంగా రైతుల శ్రేయస్సుకు రాజారావు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రఖ్యాత స్వామినాథన్ ఇచ్చిన విలువైన సలహాలను రైతు సంక్షేమానికి అమలు చేస్తామని రాజారావు ఆయనకు తెలిపారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles