సీఎంఆర్‌ఎఫ్ మంజూరు పత్రాలు పంపిణీ

Sun,September 8, 2019 02:43 AM

కూసుమంచి/తిరుమలాయపాలెం: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్యానికి ఆర్థిక సహాయం అందించే అనుమతి పత్రాలను ముగ్గురు బాధితులకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లికి చెందిన బానోత్ నవీన్ వైద్యానికి రూ.2 లక్షలు, తేజావత్ రామ్‌తేజకు రూ.1.5 లక్షలు, కాకరవాయి గ్రామానికి చెందిన సలిగంటి వెంకన్నకు రూ.1.5 లక్షల వరకు వైద్యానికి నిధులు మంజూరు చేస్తూ సీఎంఆర్‌ఎఫ్ నుంచి అందిన పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం కోసం తమను సంప్రదిస్తే మంజూరు చేయిస్తామన్నారు. ఈకార్యక్రమంలో తిరుమలాపాలెం, కూసుమంచి ఎంపీపీలు బోడా మంగీలాల్, బానోత్ శ్రీనివాస్, జల్లేపల్లి ఎంపీటీసీ బాలునాయక్, సర్పంచ్ బీ.శైలజ, టీఆర్‌ఎస్ నాయకులు కందాల క్రాంతి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, ఇంటూరి శేఖర్, చావా వేణు, కోటి సైదారెడ్డి, బారి శ్రీను, చాట్ల పరుశరాం, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles