చేపల పెంపకం మత్స్యకారులకు వరం..

Sun,September 8, 2019 02:44 AM

-మత్స్య సంపదను కాపాడుకొని ఆదాయాన్ని పొందాలి
-రఘునాథపాలేనికి 10.10లక్షల చేప పిల్లలు పంపిణీ
-ఎమ్మెల్యే అజయ్ కుమార్

రఘునాథపాలెం:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెరువుల్లో చేపల పెంపకం కార్యక్రమం మత్స్యకారులకు వరంలాంటిదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. చెరువుల్లో పోసిన చేపల సంపదను అభివృద్ధి చేసుకొని ఆర్థిక పరిపుష్టిని పొందాలన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శనివారం రఘునాథపాలెం మండలం కోటపాడు చెరువులో 72,200వేల చేప పిల్లలను పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఐదేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో సరైన వర్షాలు లేక తెలంగాణ వ్యాప్తంగా చెరువులు పడావు పడ్డాయన్నారు. మిషన్ కాకతీయ పథకంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. ఏ చెరువును చూసిన జలసిరితో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గత నాలుగేళ్లుగా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ముందు చూపుతో కేసీఆర్ తీసుకున్న మిషన్ పథకంతో కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వ వైభవం తీసుకవచ్చినైట్లెందన్నారు. చెప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా బడుగు బలహీన వర్గాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే ముందుకు తీసుకవస్తోందన్నారు. చెరువులో వదిలిన చేప పిల్లలు భవిశ్యత్తులో రూ.లక్షల ఆదాయాన్ని ఇచ్చే విధంగా కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ భుక్యా గౌరి, వైస్ ఎం పీపీ గుత్తా రవికుమార్, ఆత్మ చైర్మన్ బోయినపల్లి లక్ష్మణ్‌గౌడ్, గ్రామ సర్పంచ్ బాతుల రమణ, ఉపసర్పంచ్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్ రావు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు రామా వెంకటేశ్వర్లు, మత్య్సశాఖ అధికారులు, మత్య్స సొసైటీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

193
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles